మెగా కాంపౌండ్ లో ముందస్తు క్రిస్టమస్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ మేరకు మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కు సంబంధించిన పిక్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ లో మెగా హీరోలు, మెగా డాటర్స్, కజిన్స్ అందరూ ఉన్నారు. రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శిరీష్, నిహారిక, సుస్మిత, శ్రీజ, స్నేహారెడ్డి, ఉపాసన, తదితరులు ఉన్నారు. ప్రస్తుతానికైతే, ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
రాంచరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లితండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సో, చరణ్&ఉపాసనలకు ఈ క్రిస్మస్ పార్టీ మరింత స్పెషల్ అన్నమాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa