కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు తెలుగులో చాలా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఐతే, కొన్నాళ్ళబట్టి తెలుగులో విశాల్ సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో తన కొత్త సినిమా లాఠీ ప్రమోషన్స్ ను విశాల్ ఇరు తెలుగు రాష్ట్రాలలో ముమ్మరంగా చేస్తున్నారు. నిన్న తిరుపతిలో రెండు చోట్ల లాఠీ ప్రమోషన్స్ చేసిన విశాల్ ఈ రోజు నగరిలోని ఒక ధియేటర్ను విజిట్ చేసి లాఠీ ప్రమోషన్స్ చేసారు. పోతే, లాఠీ మూవీ ఈ గురువారం పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
ఏ. వినోద్ కుమార్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సునైనా హీరోయిన్ గా నటిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa