"బేబీ" సినిమా టీజర్ రిలీజై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తాజాగా విడుదలైన ఫస్ట్ లిరికల్ 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' కూడా అంతే బజ్ ను క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. విజయ్ బుల్గనిన్ స్వరకల్పనలో సోల్ ఫుల్ మెలోడీగా రూపొందిన ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ను సింగర్ శ్రీరామచంద్ర అండ్ చిల్డ్రన్ కోరస్ పాడారు. అనంత శ్రీరామ్ హృద్యమైన లిరిక్స్ అందించారు. మొత్తానికి ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది.
ఈ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తుండగా, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీనివాస కుమార్ నిర్మిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు. పోతే, ఈ మూవీ మార్చ్, 2023 మొదటి వారంలో విడుదల కాబోతుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa