ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ ఆంథోనీ 'బిచ్చగాడు2' పై లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 06:40 PM

మల్టీ ట్యాలెంటెడ్ విజయ్ ఆంథోనీ 'బిచ్చగాడు' సినిమాతో ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ అయ్యారు. 2016లో విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలోని కొన్ని థియేటర్లలో వంద రోజులకు పైగా ఆడిందంటే... ఈ మూవీ ఇంపాక్ట్ తెలుగువారిపై ఎంతలా పడిందో క్లియర్ గా అర్ధం అవుతుంది.


విజయ్ ఆంథోనీ కెరీర్ లోనే వెరీ స్పెషల్ ఫిలిం గా చోటు సంపాదించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ అతి త్వరలోనే రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. విశేషమేంటంటే, ఈ సినిమాకు విజయ్ డైరెక్టర్ గా కూడా పని చేస్తున్నారు. అలానే సంగీత దర్శకుడిగానూ పని చేస్తున్నారు.


ఈ ప్రాజెక్ట్ పై తాజా అప్డేట్ ప్రకారం, ఈ మూవీ డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను స్టార్ నెట్ వర్క్ కొనుగోలు చేసిందని తెలుస్తుంది. 2023 వేసవి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa