ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"హిట్ 2" డిజిటల్ ఎంట్రీ పై లేటెస్ట్ అప్డేట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 03:38 PM

అడివిశేష్ హీరోగా నటించిన "హిట్ 2" అద్భుతమైన ధియేటర్ రన్ ను జరుపుకుంటుంది. రోజురోజుకూ ప్రజాదరణను పెంచుకుంటూ, బాక్సాఫీస్ వద్ద మ్యాజికల్ నంబర్స్ ను నమోదు చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తుంది. ఇండియాలోనే కాక ఓవర్సీస్ లో కూడా హిట్ 2 సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది.


లేటెస్ట్ గా హిట్ 2 మూవీ డిజిటల్ ఎంట్రీ పై ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. అదేంటంటే, హిట్ 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే కదా. ఈ ఓటిటిలో వచ్చే నెల మొదటి వారంలో హిట్ 2 స్ట్రీమింగ్ కి రాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు అతి త్వరలోనే అఫీషియల్ అప్డేట్ రాబోతుందట. 


శైలేష్ కొలను డైరెక్షన్లో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa