టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న 'బేబీ' సినిమా కొన్ని నెలల క్రితం స్టైల్‌గా లాంచ్ అయ్యింది. సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలోని మొదటి సింగిల్ 'ఓ రెండు ప్రేమ మేఘలీలా'డిసెంబర్ 20, 2022న సాయంత్రం 05:04 గంటలకు విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ ప్రకటించారు. ఈ ట్రాక్‌కి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన ఈ సింగిల్ ని శ్రీరామ చంద్ర పాడారు.
లవ్ స్టోరీ ట్రాక్ లో రానున్న బేబీ సినిమాలో హీరో విరాజ్ అశ్విన్ అండ్ యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై SKN ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa