ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐశ్వర్య రాజేష్ 'సుజల్' వెబ్ సిరీస్ కి అద్భుతమైన గుర్తింపు

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 19, 2022, 06:31 PM

విక్రమ్ వేద వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన పుష్కర్-గాయత్రి 'సుజల్: ది వోర్టెక్స్' అనే వెబ్ సిరీస్‌ ని రూపొందించిన సంగతి అందరికి తెలిసిందే. బ్రమ్మ మరియు అనుచరణ్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించింది. సుజల్: వోర్టెక్స్ సీజన్ 1 జూన్ 17న OTT ప్లాట్‌ఫారమ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూస్ ని అందుకుంది.


ఇప్పుడు తాజాగా హాలీవుడ్ యొక్క ప్రముఖ వెబ్‌సైట్ వెరైటీ 2022 యొక్క అగ్ర అంతర్జాతీయ టీవీ షోల లిస్ట్ ని విడుదల చేసింది. సుజల్ ఈ ఎలైట్ లిస్ట్‌లో స్థానం సంపాదించింది. ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ వెబ్ సిరీస్ ఇదే. సుజల్‌లో కథిర్, రాధాకృష్ణన్ పార్థిబన్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, ఎలాంగో కుమారవేల్, నివేదిత సతీష్ మరియు గోపికా రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌ని పుష్కర్-గాయత్రి నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa