ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ గత శుక్రవారం థియేటర్లకు వచ్చింది బిగ్ బడ్జెట్ హాలీవుడ్ మూవీ అవతార్ 2. పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తదుపరి అవతార్ కి సీక్వెల్ రాబోతుండడంతో ఆడియన్స్ అందరిలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ వినిపించాయి. ఇక, విడుదల తరవాత ఆ పాజిటివ్ వైబ్స్ కాస్తా... సూపర్ పాజిటివ్ రివ్యూలుగా మారి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసేందుకు సహకరిస్తున్నాయి.
ఇండియాలోనూ అవతార్ 2 హంగామా అంతా ఇంతా కాదు. ప్రీ సేల్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్న కేజీఎఫ్ 2 ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ ను కైవసం చేసుకుంది అవతార్ 2. ఇక, ఫస్ట్ డే 41+కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి సెకండ్ హైయెస్ట్ హాలీవుడ్ గ్రాసర్ గా నిలిచింది. లేటెస్ట్ గా నిన్ననే ఫస్ట్ సండేను ముగించుకున్న అవతార్ 2 ఫస్ట్ వీకెండ్ కి టోటల్గా 129+కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఎవెంజర్స్ (157+కోట్లు )సినిమా తదుపరి హైయెస్ట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను సాధించిన రెండవ సినిమాగా అవతార్ 2 రికార్డులకెక్కింది.
ఇక, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అవతార్ 2 ఫస్ట్ వీకెండ్ కల్లా 434.5మిలియన్ (3500 కోట్లు)డాలర్లను క్రాస్ చేసినట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa