ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాల్ 'లాఠీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 19, 2022, 03:24 PM

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నుండి రాబోతున్న సరికొత్త సినిమా "లాఠీ". ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 22న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.


విడుదల తేది దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ లాఠీ తెలుగు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ రోజు మధ్యాహ్నం మూడుగంటల నుండి ఐదు గంటల వరకు తిరుపతి SV ఇంజనీరింగ్ కాలేజీలో మరియు రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు SDHR కాలేజీలలో లాఠీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.


A .వినోద్ కుమార్ డైరెక్షన్లో పవర్ఫుల్ పోలీస్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా లో విశాల్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు. సునయన హీరోయిన్ గా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. రాణా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ, నందా  నిర్మిస్తున్నారు. .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa