KD అకా కృష్ణదేవ్ అకా అడివిశేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ 2 మేకర్స్ నుండి సూపర్బ్ బర్త్ డే ట్రీట్ వచ్చింది. అదేంటంటే, హిట్ 2 సినిమా మొదటి నాలుగు నిమిషాల వీడియోను స్పెషల్ గా విడుదల చేసి ఆడియన్స్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ నాలుగు నిమిషాల వీడియో చూస్తే, ఈ సినిమాలో అడివిశేష్ పోషించిన 'KD' పాత్ర నేపధ్యం ఎలా ఉండబోతుందన్నది ఇట్టే అర్ధం అవుతుంది. ఆ పాత్రకున్న నోటిదూల, వెటకారం, క్రైమ్ మిస్టరీని క్షణాల్లోనే సాల్వ్ చెయ్యగల తెలివితేటలు.. మొత్తంగా హిట్ 2 సినిమాలో శేష్ ఒక పక్కా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయారని తెలుస్తుంది.
పోతే, హిట్ 2 సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు కాగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. నాచురల్ స్టార్ నాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa