యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నుండి ఈ ఏడాది విడుదలైన సినిమా "రంగరంగ వైభవంగా". వైష్ణవ్ తేజ్, కేతికాశర్మ జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డిసెంబర్ 18న అంటే రేపు సాయంత్రం ఆరింటికి జీ తెలుగు ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమైంది.
గిరీశాయ ఈ మూవీని డైరెక్ట్ చెయ్యగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా, బాపినీడు సమర్పించారు.
ధియేటర్ ఆడియన్స్ ను అంతగా మెప్పించలేకపోయిన ఈ సినిమాకు డిజిటల్ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. మరి, బుల్లితెర ప్రేక్షకులు ఈ సినిమాను ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa