నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న కొత్త చిత్రం "వీరసింహారెడ్డి". కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుండి సుగుణసుందరి డ్యూయెట్ సాంగ్ విడుదలైంది. థమన్ ఈ సాంగ్ ను పెప్పీ ట్యూన్ తో కంపోజ్ చెయ్యగా, శేఖర్ మాస్టర్ స్టైలిష్ కొరియోగ్రఫీ చేసారు. ఇక, స్క్రీన్ పై బాలయ్య - శృతి హాసన్ల అద్భుతమైన కెమిస్ట్రీ, గ్రేస్ స్టెప్స్... ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. రామ్ మిరియాల, స్నిగ్ధ కలిసి పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించారు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి నుండి ఒక్కక్కటిగా లిరికల్ సాంగ్స్ విడుదలవుతూ వస్తున్నాయి. వాటికి ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడుతుంది కూడా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa