ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లైన్లోనే ఉన్న... రాంచరణ్ - నార్తన్ల ప్రాజెక్ట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 15, 2022, 08:48 AM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానతో రీసెంట్గానే ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఐతే, ఇది RC 16 ఆ? కాదా ? అన్నది క్లారిటీ లేదు.


ఈ నేపథ్యంలో మరోసారి రామ్ చరణ్ - నార్తన్ ల ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. బుచ్చిబాబు తో సినిమా ప్రకటన జరగడంతో, ఇక రామ్ చరణ్ - నార్తన్ ల ప్రాజెక్ట్ ఉండదని అంతా అనుకున్నారు. కానీ తాజా బజ్ ప్రకారం, చరణ్- నార్తన్ ల ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయని తెలుస్తుంది.


ఒక వేళ ఈ వార్త నిజమే ఐతే, RC 16 మూవీ  బుచ్చిబాబుతో ఉంటుందా? లేక నార్తన్ తో ఉంటుందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మరి, ఇందుకు సమాధానం తెలియాలంటే, వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఎందుకంటే, నార్తన్ - చెర్రీల ప్రాజెక్ట్ ఎనౌన్స్మెంట్ నెక్స్ట్ ఇయర్ లో జరుగబోతోంది మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa