ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాన్ ఇండియా విజయంతో పారితోషికం పెంచేసిన యంగ్ హీరో..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 07:50 PM

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ నటించిన "కార్తికేయ 2" పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ సక్సెస్ సాధించింది.  కార్తికేయ 2 తో నిఖిల్ కు ఉత్తరాదిన చాలా మంచి క్రేజ్ ఏర్పడింది. అంతేకాక ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులపై ప్రేక్షకాభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమాతో సక్సెస్ గ్రాఫ్ ను అమాంతం పెంచేసుకున్న నిఖిల్ పారితోషికాన్ని కూడా అలాగే పెంచేసాడని వినికిడి. కార్తికేయ 2 సినిమా ముందువరకు ఒక్కో ప్రాజెక్ట్ కు నాలుగు కోట్లు తీసుకునేవాడట. ఎప్పుడైతే, కార్తికేయ 2 విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో ఆ తరవాతి నుండి తన వద్దకు వస్తున్న ఆఫర్లకు ఎనిమిది కోట్లను డిమాండ్ చేస్తున్నాడని టాక్.


నిఖిల్ నుండి ఈ నెల 23న '18 పేజెస్' మూవీ విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa