ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"నువ్వు శ్రీదేవి ఐతే"... సాంగ్ లీక్ చేసిన మెగాస్టార్.. వైరల్ పోస్ట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 06:18 PM

కొంచెంసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఇదేదో నార్మల్ వీడియో కాదు... డిసెంబర్ 12న షూటింగ్ ముగించుకున్న వాల్తేరు వీరయ్య డ్యూయెట్ సాంగ్ కు సంబంధించిన వీడియో.. ఈ సాంగ్ షూటింగ్ జరిగిన షూటింగ్ స్పాట్స్ ను స్వయంగా చిరంజీవి గారు వీడియో తీసి, ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అలానే ఈ పాట యొక్క చిన్న బిట్ ను కూడా చిరు 'లీక్' చేసారు. 'నువ్వు శ్రీ దేవి ఐతే... నేను చిరంజీవి అవుతా' అని దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ లో, ఫుట్ టాప్పింగ్ ట్యూన్ తో కూడిన ఈ సాంగ్..సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉంది. మరి, త్వరలోనే ఈ సాంగ్ యొక్క లిరికల్ వెర్షన్ రిలీజ్ కాబోతుందని చిరు తెలిపారు.


బాబీ డైరెక్షన్లో చిరంజీవి, రవితేజ జంటగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కాబోతుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa