సౌత్ స్టార్ హీరో విజయ్ ఆంటోని అద్భుతమైన స్క్రిప్ట్‌లతో సినిమా ప్రేమికులని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తుంటాడు. బిచ్చగాడు సినిమాతో నటుడిగా మారిన మ్యూజిక్ కంపోజర్ విజయ్ ఆంథోని ఇటీవల రాజకీయ కథ చిత్రం 'విజయ రాఘవన్' లో కనిపించాడు. ఈ సినిమా అన్నిచోట్ల మిశ్రమ స్పందనను అందుకుంది.
తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం డిసెంబర్ 16 నుండి ZEE5లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని సమాచారం. OTT ప్లాట్ఫారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఒరిజినల్ వెర్షన్ కొడియిల్ ఒరువన్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా, తెలుగు వెర్షన్ రైట్స్ ని ZEE5 చేజిక్కించుకుంది.
ఈ సినిమాలో విజయ్ సరసన ఆత్మిక జోడిగా నటించింది. ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ మరియు చెందూర్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa