ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు రాబోతున్న మచ్ ఎవైటెడ్ "ధమాకా" ట్రైలర్..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 04:32 PM

ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ ..బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో మాస్ రాజా రవితేజ సక్సెస్ గ్రాఫ్ కాస్తంత డౌన్ స్టేజ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "ధమాకా" తో రవితేజ సూపర్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ధమాకా మూవీ ఈ నెల 23న థియేటర్లలో విడుదల కాబోతుంది. విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందు అంటే రేపు ధమాకా ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని మరొక్కసారి కంఫర్మ్ చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు రేపు సాయంత్రం 06:45 నిమిషాలకు ధమాకా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.


శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa