ప్రపంచవ్యాప్త సినీ ప్రేక్షకుల పదమూడేళ్ల నిరీక్షణకు మరో రెండ్రోజుల్లో తెర పడబోతోంది. 2009 డిసెంబర్ 18వ తేదీన ప్రపంచ సినీ చరిత్రలో అద్భుతమైన దృశ్య కావ్యం "అవతార్" రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు ప్రపంచ దేశాల ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అవతార్ సీక్వెల్ 'అవతార్ : ది వే ఆఫ్ వాటర్' పదమూడేళ్ల తరవాత ఈ నెల 16వ తేదీన 160 భాషల్లో ఘనంగా విడుదల కాబోతుంది. వరల్డ్ వైడ్ గా అవతార్ 2 మూవీ 52000 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో ఇప్పటి వరకు ఆల్ టైం నెంబర్ వన్ గ్లోబల్ రిలీజ్ గా ఉన్న 'ఎవెంజర్స్ ఎండ్ గేమ్' సెకండ్ ప్లేస్ లోకి పడిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa