హాలీవుడ్ లో RRR ప్రమోషన్స్ చేస్తూ రాజమౌళి గారు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో రాజమౌళిని విలేఖరి ఇలా అడుగుతాడు.. మీరు 2023లో ఏ హీరో సినిమా కోసం కుతూహలంగా ఎదురుచూస్తున్నారు? అని. అందుకు రాజమౌళి బదులిస్తూ.. సుకుమార్ డైరెక్షన్లో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించబోయే సినిమా కోసం తాను వేకళ్ళతో ఎదురుచూస్తున్నానని, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓపెనింగ్ సీక్వెన్స్ ను చరణ్ తనకు వివరించాడని, అది తనకు గూజ్ బంప్స్ తెప్పించిందని, దీంతో ఈ సినిమాపై తనకు విపరీతమైన ఆసక్తి కలిగిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.
సుకుమార్ - చరణ్ కలయికలో రంగస్థలం సినిమా వచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరవాత వీరి కలయికలో ఎలాంటి సినిమా ప్రకటింపబడలేదు. కానీ వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారని రాజమౌళి చెప్తే కానీ ఇప్పటివరకు ఆడియన్స్ కు తెలియదు. దీంతో రంగస్థలం మ్యాజిక్ మరోసారి రిపీట్ కాబోతుందని మెగా అభిమానులు సంబరపడిపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa