మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "ధమాకా". ఈ సినిమాకు డైరెక్టర్ నక్కిన త్రినాధరావు కాగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. ఈనెల 23న ధమాకా సినిమా థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గానే సెన్సార్ పూర్తి చేసుకున్న ధమాకా మూవీ రన్ టైం పై తాజాగా ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటంటే, రెండు గంటల పది నిమిషాలతో ఈ సినిమా క్రిస్పీ రన్ టైంను లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. పోతే, ధమాకా మూవీకి సెన్సార్ బృందం యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa