RRR చిత్రం విడుదలైనప్పటి నంచి ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్నేషనల్ అవార్డుల్లో మరోసారి మెరిసింది RRR. ‘లాస్‌ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ బెస్ట్ మ్యూజిక్ కేటగిరిలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు గాను కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అలాగే బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్‌లో కూడా కీరవాణి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విన్నర్‌గా అవార్డు గెలుచుకున్నారు.