సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా రజినీకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
రజినీకాంత్ నటిస్తున్న 161వ చిత్రం "జైలర్" నుండి అభిమానులకు బర్త్ డే ట్రీట్ గా ఈ రోజు సాయంత్రం ఆరింటికి ఒక స్పెషల్ సర్ప్రైజ్ రాబోతుంది. 'ముత్తువేల్ పాండియన్' గా రజినీ రాక కోసం ఆయన అభిమానులు ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రమ్యకృష్ణ, యోగిబాబు కీరోల్స్ లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa