ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USA లో 1 మిలియన్ మార్క్ కు చేరువలో HIT 2..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 11, 2022, 06:33 PM

"మేజర్" తో ఈ ఏడాది ప్రారంభంలో గ్రాండ్ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న యంగ్ హీరో అడివిశేష్ నుండి వచ్చిన మరొక కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ "హిట్ 2". మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే.


హిట్ 2 ప్రభావం ఓవర్సీస్ బాక్సాఫీస్ పైన బాగానే కనపడుతుంది. అందులోనూ USA లో ఫస్ట్ వీకెండ్ కే హాఫ్ మిలియన్ మార్క్ ను అందుకున్న హిట్ 2 1 మిలియన్ మార్క్ కు అతి చేరువలో ఉంది. ఒకే ఏడాది లో USA లో మేజర్ సినిమాతో ఫస్ట్ వన్ మిలియన్ సినిమాను ఖాతాలో వేసుకున్న శేష్ హిట్ 2 తో రెండో వన్ మిలియన్ సినిమాను కూడా తన పేరు మీద నమోదు చేసుకోబోతుండడం విశేషం.  ఈ మేరకు ఆడియన్స్ కు థాంక్స్ చెప్తూ శేష్ ట్వీట్ చేసారు


శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని గారు నిర్మించడం జరిగింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa