నిన్నటివరకు జరిగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆహా సంస్థ నుండి కొంతసేపటి క్రితమే ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా .. అదేనండి బాలయ్య బాబు తో ప్రభాస్ క్రేజీ చిట్ చాట్ గురించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఈ రోజు నుండి జరగుతుంది.
చాలా రోజుల తరవాత ప్రభాస్ తెలుగులో ఇస్తున్న ఇంటర్వ్యూ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ పై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నారు. అదీకాక ఆహా సంస్థ 'డార్లింగ్ ను మీరేమన్నా ప్రశ్నలను అడగలనుకుంటున్నారా.. ఆ ప్రశ్నలు క్రేజీగా ఉంటేనే బాలయ్య బాబు ప్రభాస్ ను అడగడం జరుగుతుంది' అని తెలపడంతో... డార్లింగ్ ఫ్యాన్స్ ఆయనను అడగాలనుకుంటున్న ప్రశ్నలను కామెంట్ల రూపంలో పంపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa