ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ కల్యాణ్ సినిమా పేరు మారింది

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 11, 2022, 09:24 AM
పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అంటూ ఇప్పటికే టైటిల్‌తో పాటు, పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. గతకొంతకాలంగా ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఈ క్రమంలో ఈ మూవీ టైటిల్‌ను మార్పు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ అంటూ కొత్త టైటిల్‌, పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్యాగ్‌ లైన్‌ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ తాజా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa