హిట్ : ది ఫస్ట్ కేస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన దర్శకుడు శైలేష్ కొలను. హిట్ : ది సెకండ్ కేస్ తో రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన హిట్ 2 ను వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని నిర్మించారు. పవర్ ఫుల్ కంటెంట్ తో, క్రిస్పీ టేకింగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ 2 మూడ్రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి, నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది.
తాజాగా శైలేష్ కొలను హిట్ 2 ఘనవిజయాన్ని తన భార్య స్వాతికి అంకితం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. రాక్ సాలిడ్ ఉమెన్ తో 10 సంవత్సరాల వివాహ జీవితం.. 17 ఏళ్ల రిలేషన్ షిప్ .. స్వాతి కోసమే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను.. హిట్ 2 సక్సెస్ నా లవ్లీ వైఫ్ కు డేడికేట్ చేస్తున్నా... అంటూ భార్య స్వాతి, కుమారుడితో దిగిన ఫోటోను పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa