యంగ్ హీరో సంతోష్ శోభన్, కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ జంటగా నటిస్తున్న చిత్రానికి "కళ్యాణం కమనీయం" అనే బ్యూటిఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ ఈ రోజే మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి న్యూస్ లేదు. సడెన్ గా ఈ మూవీ టైటిల్ తో పాటు ఒకేసారి రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చెయ్యడం, అదికూడా సంక్రాంతి టైం విడుదల కాబోతుండడంతో ఆడియన్స్ ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు.
ఈ సినిమాకు అనిల్ కుమార్ ఆళ్ళ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న కళ్యాణం కమనీయం చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa