ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మి సోషల్ మీడియాలో నిత్యం ట్రోల్స్ వస్తుంటాయి. ఈ ట్రోల్స్, మీమ్స్ పై మంచు లక్ష్మి స్పందించారు. వాటిని చూసి ఆస్వాదిస్తానని తెలిపారు. అవి తయారుచేసేవాళ్లకు ఇంకా ఏదైనా కొత్తగా చేసేందుకు ఐడియాలు ఇవ్వాలనుకుంటానని తెలిపారు. తాజాగా మోహన్ లాల్ తో కలిసి మాన్ స్టర్ సినిమాలో నటించడంపై ఆమె స్పందిస్తూ ఆ చిత్రంలో మంజు అనే మంచి క్యారెక్టర్ పోషించానని తెలిపారు. సినిమాల్లో కంటే టీవీ కార్యక్రమాల్లోనే నన్ను నేనుగా ప్రేక్షకులకు చూపించుకోగలుగుతానని ఆమె వెల్లడించారు.