రేపు విడుదల కాబోతున్న "పంచతంత్రం" సినిమా నుండి కొంతసేపటి క్రితం టైటిల్ లిరికల్ వీడియో సోల్ ఆఫ్ పంచతంత్రం విడుదలైంది. శ్రవణ్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కం సింగర్ కాల భైరవ పాడారు. కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు.
ఈ సినిమాను హర్ష పులిపాక డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, దివ్యవాణి, నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీ విద్య మహర్షి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. టికెట్ ఫ్యాక్టరీ, S ఒరిజినల్స్ సంయుక్త బ్యానర్ లపై అఖిలేష్ వర్ధన్, సృజన్ యరబోలు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa