నిఖిల్ సిద్దార్ధ్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "18 పేజెస్". ఈ సినిమా నుండి విడుదలైన నన్నయ్య రాసిన, టైమివ్వు పిల్ల సాంగ్స్ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. టైమివ్వు పిల్ల సాంగ్ ఐతే, పెప్పీ ట్యూన్ తో కూడిన బ్రేకప్ సాంగ్ కావడంతో యువత హాట్ ఫేవరెట్ గా నిలిచింది. ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి వస్తున్న విశేష ఆదరణ నేపథ్యంలో మేకర్స్ మరొక బ్యూటిఫుల్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు అతి త్వరలోనే 18పేజెస్ థర్డ్ సింగిల్ విడుదల కాబోతుందని పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. పోతే, ఈ పాటను గోపి సుందర్ స్వరపరచగా, స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. శ్రీమణి లిరిక్స్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa