నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ల క్రేజీ కలయికలో తెరకెక్కనున్న సినిమా ఈరోజే అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు హాజరయ్యారు. ఈ రోజు నుండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది కూడానూ. ఫస్ట్ షాట్ కి రాఘవేంద్రరావు గారు గౌరవ దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్ గారు క్లాప్ కొట్టారు. దిల్ రాజు గారు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ ఈవెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ కెరీర్ లో 108వ సినిమాగా రూపొందుతున్న ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa