తన నటనతో దక్షిణాదిన మెప్పించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌కు వెళ్లబోతోంది. అది కూడా ఓ పౌరాణిక చిత్రంలో సీత పాత్ర పోషిస్తుండటం గమనార్హం. రణబీర్ కపూర్ హీరోగా రామాయణం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందబోతోంది. ఇందులో రాముడిగా రణబీర్ నటిస్తుండగా.. రావణుడి పాత్రను హృతిక్ రోషన్ పోషించనున్నాడు. ఇందులో సీత పాత్రకు సాయిపల్లవిని సంప్రదించినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ పాత్రకు గతంలో దీపిక పదుకొణె, కరీనా కపూర్ పేర్లు వినిపించాయి. ఇప్పుడేమో సాయిపల్లవిని ఫైనల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa