నందమూరి బాలకృష్ణ 108వ సినిమాను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నాడు. థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మించనున్నాడు. ఈ సినిమాలో నటించే హీరోయిన్, తదితర నటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. 'అన్న దిగిండు! గిప్పడి సంది లెక్కలు టక్కర్' అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. బాలకృష్ణ కొత్తగా చూపించబోతున్నట్లు తెలిపాడు.