హీరో సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఎనౌన్స్మెంట్ టీజర్ కొంతసేపటి క్రితమే విడుదలైంది. ఈ సినిమాకు విరూపాక్ష అనే యూనిక్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో SDT 15 టైటిల్ లాంచ్ ఈవెంట్ జరిగింది.
ఈ ఈవెంట్ లో డైరెక్టర్ కార్తీక్ దండు మాట్లాడుతూ హీరో సాయిధరమ్ తేజ్ కు సారీ చెప్పారు. ఈ సినిమాలో చాలా నైట్ సీక్వెన్సెస్ ఉన్నాయని, యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి, ఆపై కోలుకుని, సెట్స్ లో అడుగుపెట్టిన తేజ్ చాలా డిఫికల్టీస్ ను ఫేస్ చేసారని, ఇబ్బంది పెట్టినందుకు సారీ అని, కానీ ఖచ్చితంగా ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఒక కొత్త అవతార్ లో కనిపించి ప్రేక్షకుల మెప్పును పొందడం ఖాయం.. అంటూ చెప్పుకొచ్చారు.
సీరియస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 21 వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa