నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నక్కిన త్రినాధరావు ప్రస్తుతం మాస్ రాజా రవితేజ తో "ధమాకా" సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమానుండి నిన్న దందకడియాల్ అనే మాస్సివ్ మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్ అవ్వగా, తాజాగా మేకర్స్ ఆ సాంగ్ రిలీజ్ డేట్ అండ్ టైం ను ఎనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చెయ్యడం జరిగింది. ఈ మేరకు రేపు ఉదయం 11:01 నిమిషాలకు ధమాకా చిత్రం నుండి దందకడియాల్ లిరికల్ సాంగ్ రాబోతుంది.
భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. పోతే, ఈనెల 23న ధమాకా సినిమా థియేటర్లకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa