మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాబడని ఈ సినిమా రీసెంట్గానే న్యూజిలాండ్ లో సాంగ్స్ షూటింగ్ ను జరుపుకుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, RC 15 నెక్స్ట్ షెడ్యూల్ ఈ వారంలోనే ప్రారంభం కాబోతుందని వినికిడి. న్యూజిలాండ్ షెడ్యూల్ తదుపరి చరణ్ ఢిల్లీ వెళ్లి NDTV వారు అందించే ట్రూ లెజెండ్ - ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును అందుకున్నారు. ఈ మేరకు చరణ్ అవార్డు తీసుకుంటున్న వీడియో, పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa