మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ సమంత కలిసి జంటగా నటిస్తున్న చిత్రం "ఖుషి". మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.
సమంత అనారోగ్యం కారణంగా ఖుషి మూవీ షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇంకా ఐదు వారాల షూటింగ్ బ్యాలన్స్ ఉన్న ఈ సినిమా న్యూ షెడ్యూల్ ను త్వరలోనే స్టార్ట్ చేసి, డిసెంబర్ 23నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం మేకర్స్ ఉప్పెన బ్యూటీ కృతిశెట్టిని అప్రోచ్ అయ్యారని టాక్ నడుస్తుంది. మరి, ఈ విషయంలో క్లారిటీ రావాలంటే, అధికారిక ప్రకటన రావాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa