ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ముఖచిత్రం" సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:31 PM

వికాస్ వసిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్య రావు, అయేషా ఖాన్, రవిశంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "ముఖచిత్రం". ఇందులో యంగ్ హీరో విశ్వక్ సేన్ స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ రోల్ చేసారు.


తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ "అందరిలా నేనున్నానా" అనే బ్యూటిఫుల్ లిరికల్ సాంగ్ విడుదలైంది. పెళ్ళైన హీరో, హీరోయిన్ల ఆప్యాయతానురాగల నేపథ్యంలో వచ్చే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది.


గంగాధర్ డైరెక్షన్లో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను పాకెట్ మనీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ యాదవ్, మోహన్ ఎల్లా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ చిత్రం డిసెంబర్ 9న అంటే ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa