అవతార్ 2... 13 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా. జేమ్స్ కెమరూన్ డైరెక్షన్లో అద్భుతమైన విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదల కావడానికి రెడీ గా ఉంది. ప్రేక్షకులందరూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని ఎదురు చూస్తుంటే, కేరళ రాష్ట్రం మాత్రం అవతార్ 2 సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటుంది. ఈమేరకు ఫిలిం ఎక్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEUOK) ప్రెసిడెంట్ గారు మీడియా తో మాట్లాడుతూ.. అవతార్ 2 ప్రాఫిట్ షేర్స్ చర్చలు సఫలం కాలేదు. డిస్ట్రిబ్యూటర్స్ కి ధియేటర్ ఓనర్స్ కి ఒక ప్రాపర్ అగ్రిమెంట్ అన్నది జరగలేదు.. అందుకే అవతార్ 2 సినిమాను కేరళలో ప్రదర్శించబోవట్లేదు. అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa