నటసింహం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 108వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్యకు కూతురిగా నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం బాలయ్య వీరసింహారెడ్డి షూటింగ్ లో బిజీగా ఉండడంతో, అనిల్ సినిమా వచ్చే జనవారికి షిఫ్ట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది.
విషయమేంటంటే, ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా బాలీవుడ్ బొద్దు గుమ్మ సోనాక్షి సిన్హా నటించబోతుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. లేటెస్ట్ గా సోనాక్షి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయంపై సాలిడ్ క్లారిటీ ఇచ్చింది. ఒక తెలుగు సినిమాలో తాను నటించబోతున్నట్టు కొన్నిరోజులుగా ఆర్టికల్స్ వస్తున్నాయి... దీనిపై నేనిచ్చే క్లారిటీ ఏంటంటే.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు... అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. దీంతో బాలయ్య హీరోయిన్ పై మళ్ళీ కన్ఫ్యూషన్ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa