బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం "సర్కస్". 'చెన్నై ఎక్స్ ప్రెస్' ఫేమ్ రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఔటండౌట్ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందింది.
తాజాగా ఈ రోజే సర్కస్ మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ సినిమా 1960ల బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఆ సమయంలో ఒక సర్కస్ ఫ్యామిలీ చేసే మ్యాజిక్, ఫీట్లు... చూసే ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వు తెప్పించేలా ఉన్నాయి.
ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరొక హీరోయిన్ గా నటిస్తుంది. తొలిసారిగా ఈ సినిమాలో రణ్ వీర్ డ్యూయల్ రోల్ లో నటించారు.
పోతే, ఈ సినిమా డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa