ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జేమ్స్ కామెరాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 02, 2022, 01:33 PM
అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. అవతార్ 2 కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 16న అవతార్ 2 విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం ఉంటే అవతార్-6,7 భాగాలను తీయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. 'ప్రేక్షకాదరణ, వ్యాపార సమీకరణాలు ఫ్రాంచైజీలను నిర్ణయిస్తాయి. అవతార్-3 2024 లో విడుదల అవుతుంది. నాలుగో భాగం కొంతమేర పూర్తయింది' అని జేమ్స్ కామరాన్ అన్నాడు. అవతార్-2 చిత్రీకరణ సమయంలోనే అవతార్-4,5 పార్ట్స్ ను జేమ్స్ కామరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa