"ఊర్వశివో రాక్షసివో" సినిమాతో చాన్నాళ్ల తరవాత హీరో అల్లు శిరీష్ గ్రాండ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. రీసెంట్గానే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా డిజిటల్ లో సందడి చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ మేరకు తెలుగు ఓటిటి ఆహాలో ఊర్వశివో రాక్షసివో చిత్రం ఈ నెల 9వ తేదీ నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుందని అధికారిక ప్రకటన విడుదలైంది.
రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, విజయ్ నిర్మించారు. అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa