తమిళ సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కె.మురళీధరన్ కన్నుమూశారు. కుంభకోణంలో ఆయన గుండెపోటుతో మృతిచెందారు. తమిళ నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గానూ ఆయన సేవలు అందించారు. తమిళంలో ఆయన నిర్మించిన గోకులాతిల్ సీతై తెలుగులో గోకులంలో సీతగా రీమేక్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ కు సూపర్ హిట్ ఇచ్చిన సినిమా కావడం విశేషం. లక్ష్మీ మూవీ మేకర్స్ పేరుతో మురళీధరన్ తమిళ టాప్ హీరోలందరితో సినిమాలు చేశారు. చివరిగా ఆయన నిర్మించిన సినిమా సకల కళా వల్లవన్ 2015లో విడుదలైంది. కాగా, మురళీధరన్ మృతిపట్ల అగ్రనటుడు కమల్ హాసన్ సంతాపం వ్యక్తం చేశారు.