ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే "ఆకాశం" మూవీ డిజిటల్ ఎంట్రీ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 08:19 PM

కోలీవుడ్ నటుడు అశోక్ శెల్వన్ హీరోగా, రీతూవర్మ, అపర్ణా బాలమురళి, శివాత్మిక హీరోయిన్లుగా నటించిన చిత్రం "ఆకాశం". రా కార్తీక్ డైరెక్షన్లో రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా రేపటి నుండే డిజిటల్ సందడి షురూ చెయ్యనుంది. అంటే ఈ రోజు అర్ధరాత్రి నుండి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ భాషలలో ఆకాశం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతుంది. 


నిన్నిలా నిన్నిలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అశోక్ శెల్వన్ ఈ సినిమాతోనే తొలి తెలుగు థియేటర్ రిలీజ్ ను పొందారు. పోతే, తమిళంలో 'నితం ఒరు వానం' టైటిల్ తో విడుదలైంది ఈ సినిమా. వయాకామ్ 18 స్టూడియోస్, శ్రీనిధి సాగర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa