ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గుర్తుందా సీతకాలం' గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 07:30 PM

నాగశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్‌ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి 'గుర్తుందా సీతకాలం' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ప్రముఖ US డిస్ట్రిబ్యూటర్ రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని యూఎస్‌ఏలో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు అని సమాచారం.


డిసెంబర్ 9, 2022న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం కన్నడ హిట్ చిత్రం 'లవ్ మోక్‌టెయిల్‌' కి అధికారిక రీమేక్. ఈ చిత్రానికి MM కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించారు. రొమాంటిక్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాని నాగశేఖర్ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa