రేపు థియేటర్లలో విడుదల కాబోతున్న హిట్ 2 మూవీలో కిల్లర్ ఎవరన్నది ఈ రోజు సాయంత్రం ఆరింటికి విడుదల చేస్తామని సర్ప్రైజ్ ఎనౌన్స్మెంట్ చేసిన మేకర్స్ ఆ కిల్లర్ ఎవరో కొంతసేపటి క్రితమే రివీల్ చేసారు.
ఇంతకూ... ఆ కిల్లర్ ఎవరంటే..మనమే. అదేనండి హిట్ 2 సినిమాలోని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లను, విలన్ ఎవరు, హిట్ 3 హీరో ఎవరు అనే ఎక్జయిటింగ్ అంశాలను సినిమా చూసి, పదిమందితో షేర్ చేసుకునే వారే... అసలైన కిల్లర్స్. ఈ విషయాన్ని పేర్కొంటూ శేష్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసారు. సినిమా చూసినప్పుడు మీరు ఫీల్ ఐన ఎక్జయిట్మెంట్ ఇతర ప్రేక్షకులు కూడా ఫీల్ అవ్వాలి, హిట్ 2 సస్పెన్స్ ను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం వాళ్ళకి కూడా ఇవ్వాలి. లేకుంటే, ఆ ఎక్జయిట్మెంట్ లెవెల్ తగ్గిపోతుంది. రెండేళ్లు కష్టపడి ఈ సినిమా చేసాం. రెండు నిమిషాల ఫన్ కోసం, రెండు సెకన్ల సీక్రెట్ ను రివీల్ చేసి, మా కష్టాన్ని వృధా చెయ్యొద్దు అంటూ...శేష్ ఆడియన్స్ కు రిక్వెస్ట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa