'అహనా పెళ్ళంట' వెబ్ సిరీస్ తో డిజిటల్ డిబట్ చేసి, రీసెంట్గానే గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్. సంజీవ్ రెడ్డి డైరెక్షన్లో ఫీల్ గుడ్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది.
లేటెస్ట్ గా రాజ్ తరుణ్ తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేసారు. ఈ రోజే ఈ మూవీ పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. పోతే, ఈ సినిమాకు టైటిల్ - 'తిరగబడర స్వామి'. సి కళ్యాణ్ గారు క్లాప్ కొట్టగా, KS రామారావు గారు కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
ఈ సినిమాకు AS రవికుమార్ చౌదరి డైరెక్టర్ కాగా, సురక్ష ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మాల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa