అడివిశేష్, మీనాక్షి చౌదరీల కలయికలో హిట్ 2 సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రేపే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్ కు తెలుగు ప్రేక్షకులతో పాటుగా నార్త్ ఆడియన్స్ నుండి కూడా విశేష స్పందన రావడంతో, అదీకాక మేజర్ సినిమాతో శేష్ కు ఉత్తరాదిన చాలా మంచి క్రేజ్ ఏర్పడిన కారణంగా, హిట్ 2 ను హిందీలో కూడా విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో శేష్ మాట్లాడుతూ.. హిట్ 2 హిందీ వెర్షన్ ను డిసెంబర్ 30వ తేదీన విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఐతే, అదేమీ అఫీషియల్ డేట్ కాదని, తాత్కాలిక విడుదల తేదీ మాత్రమేనని పేర్కొన్నారు. అంతేకాక మేజర్ సినిమాలాగానే హిట్ 2 ను కూడా ఉత్తరాదిన భారీ ప్రచారాలను చెయ్యబోతున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa