ఇషాన్ సూర్య దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విష్ణు మంచు నటించిన జిన్నా సినిమా అక్టోబర్ 21న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలయ్యింది. ఈ చిత్రానికి సినీ ప్రేమికులు నుండి విమర్శకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ రాగా ఈ చిత్రం యొక్క కలెక్షన్లు అనుకున్న మార్కుకు చేరుకోలేదు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో డిసెంబర్ 2, 2022న ఈ చిత్రాన్ని తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని ప్రకటించింది.
ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ మరియు బాలీవుడ్ యాక్ట్రెస్ సన్నీలియోన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మంచు విష్ణు తన సొంత బ్యానర్ ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి అనూప్ రూబెన్స్ సంగీత అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa